Govt Teacher: మహిళతో సహజీవనం... ఆమె కూతుళ్లపై అత్యాచారం.. హెచ్ఐవీ సోకడంతో బయటపడ్డ టీచర్ నిర్వాకం

Govt Teacher Livin RelationShip With Mother and Raped Her Daughters
  • సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణం
  • మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన ప్రబుద్ధుడు
  • తల్లితో చెబితే చంపేస్తానంటూ బెదిరింపులు
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో అమానవీయమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కూతుళ్లపై అత్యాచారం చేశాడో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆరేళ్లుగా సాగిన ఈ దారుణానికి తాజాగా తెరపడింది. రక్తపరీక్షలో ఆ ప్రబుద్ధుడికి హెచ్ఐవీ సోకినట్లు తేలడంతో ఆ బాలికలు ఇద్దరూ తమపై జరుగుతున్న అకృత్యాలను తల్లికి చెప్పారు. దీంతో ముగ్గురూ కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. భార్య చనిపోవడంతో మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. సదరు మహిళకు 19, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు కూడా తల్లితో పాటే ఉంటున్నారు. ఈ క్రమంలో మహిళతో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు అత్యంత నీచానికి పాల్పడ్డాడు. తల్లి లేని సమయంలో మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడు.

తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించి, బాలికలపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆ ప్రబుద్ధుడు వైద్య పరీక్షలు చేయించుకోగా హెచ్ఐవీ సోకినట్లు తేలింది. ఈ విషయం తెలిసి బాలికలు ఆందోళన చెంది తల్లికి విషయం చెప్పారు. తమపై జరుగుతున్న ఘోరాన్ని బయటపెట్టారు. ఈ విషయం తెలిసి షాక్ అయిన సదరు మహిళ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Govt Teacher
Rape
Girls
HIV
Suryapet District
Livin

More Telugu News