Advertisement

దేశం క్షమాపణ కోరుతుంటే.. మీరే క్షమిస్తారా?: మోదీపై కాంగ్రెస్ ఫైర్

Narendra Modi slammed by Congress as country demands apology over NEET issue
  • నీట్ నిరసనలపై ప్రధాని మోదీ వీడియో సందేశం
  • జంతర్ మంతర్‌లో తనను, తన తల్లిని దూషించారన్న ప్రధాని
  • తప్పుదోవ పట్టిన విద్యార్థులను క్షమిస్తున్నానని ప్రకటన
  • మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు
నీట్ ఆందోళన సందర్భంగా తనను, తన తల్లిని దూషించిన విద్యార్థులను క్షమిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. దేశం మొత్తం ఆయన నుంచి క్షమాపణ కోరుతుంటే, ఆయనేమో దేశాన్ని క్షమించేశారంటూ ఎద్దేవా చేసింది. 

నీట్ అక్రమాలపై జరుగుతున్న నిరసనల సందర్భంగా జంతర్ మంతర్ వద్ద తనను, తన దివంగత తల్లిని కూడా దూషించారని మోదీ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. "ఇలాంటి తప్పుదోవ పట్టిన పిల్లలను కోర్టుకు ఈడ్చడం వల్ల సమస్య పరిష్కారం కాదు. బదులుగా వారిని క్షమించాలని నేను కోరుకుంటున్నాను" అని ఆయన అన్నారు.

ప్రధాని మోదీ వీడియోను ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ మీడియా విభాగం హెడ్ పవన్ ఖేరా  ఎక్స్ వేదికగా స్పందించారు. "ఇది వినండి. దేశం ఆయనను క్షమాపణ అడుగుతుంటే.. ఆయనే దేశాన్ని క్షమించేశారు" అని తన పోస్టులో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

శుక్రవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన మరో వీడియో సందేశంలో మోదీ మాట్లాడుతూ.. సమాజంలోని ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. "జంతర్ మంతర్‌లో నన్ను మాత్రమే కాదు, నా దివంగత తల్లిని కూడా దూషించారు. కానీ దూషణలు దేన్నీ పరిష్కరించవు. తప్పుదోవ పట్టిన వారికి మనం మార్గనిర్దేశం చేద్దాం" అని ఆయన తెలిపారు. విద్యార్థులను శిక్షించడం సరైన పద్ధతి కాదని, వారు మన పిల్లలే కాబట్టి క్షమించి సరైన మార్గం చూపించడం మన కర్తవ్యమని మోదీ స్పష్టం చేశారు. 
Advertisement
Narendra Modi
Congress Party
NEET Exam Controversy
Pawan Khera
Jantar Mantar Protests
NEET Paper Leak Row

More Telugu News