ప్రధాని భోగాపురం పర్యటనకు సర్వం సిద్ధం.. థింసాతో వెల్కమ్
- నేడు అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- గిరిజన సంప్రదాయ థింసా నృత్యంతో ప్రధానికి ప్రత్యేక స్వాగతం
- స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- ప్రారంభోత్సవం అనంతరం జరగనున్న బహిరంగ సభలో నేతల ప్రసంగాలు
- పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన టెర్మినల్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో ప్రధానికి గిరిజన సంప్రదాయ థింసా నృత్యంతో ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.
ఉదయం 10.45 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ప్రధాని మోదీకి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తదితరులు స్వాగతం పలుకుతారు. అనంతరం 10.58 గంటలకు ప్రధాని మోదీ కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. సుమారు 12 నిమిషాల పాటు టెర్మినల్ భవనంలో గడిపి, అక్కడ ఏర్పాటు చేసిన తెలుగు కళాకృతులు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే చిత్రాలను తిలకించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా గిరిజన మహిళలు, బాలికలు ప్రధాని మోదీకి థింసా నృత్యంతో విశిష్ట స్వాగతం పలకనున్నారు. ఏకరీతి దుస్తులు ధరించి, సంప్రదాయబద్ధంగా వారు చేసే నృత్యం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభ వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయిలో సమీక్షించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, పి. నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.