Dokka Manikya Vara Prasad: వైసీపీలో చేరిన శైలజానాథ్ కు డొక్కా మాణిక్య వర ప్రసాద్ కీలక సూచన

Dokka Manikya Vara Prasad suggestion to Sailajanath
షార్ట్స్‌లో చూడండి
మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ... ఒక మిత్రుడిగా శైలజానాథ్ కు ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నానని... వైసీపీలో విలువలు, విశ్వసనీయతలు ఉండవని... పార్టీలో చేర్చుకునే ముందు ఎంతో ఆప్యాయంగా ఉంటారని... ఆ తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారని చెప్పారు. 

వైసీపీలో ఇప్పటికే 74 మంది నేతలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని డొక్కా అన్నారు. దళితులకు ఆ పార్టీలో విలువ ఉండదని చెప్పారు. దళితులకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ వైసీపీ అని వ్యాఖ్యానించారు. శైలజానాథ్ కు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఆ పార్టీలో చేరకపోవడమే మంచిదని సూచించారు. 

కాగా, శైలజానాథ్ ను శింగనమల వైసీపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే... ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. గత 30 ఏళ్లుగా ఇదే సెంటిమెంట్ కొనసాగుతోంది.
Go Back to Shorts
Dokka Manikya Vara Prasad
Sake Sailajanath
Jagan
YSRCP

More Telugu News