క్రికెటర్ సిరాజ్‌తో మహిరా శర్మ డేటింగ్ ప్రచారంపై స్పందించిన తల్లి
- బిగ్‌బాస్ ఫేమ్ మహిరాతో సిరా్ డేటింగ్ అంటూ జోరుగా ప్రచారం
- ఇలాంటి ఊహాగానాలు నమ్మవద్దని మహిరా శర్మ తల్లి విజ్ఞప్తి
- బయటివాళ్లు ఎన్నో అంటుంటారు... అలాంటివి నమ్మాలా? అని అసహనం
ఇలాంటి నిరాధారమైన ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దని మహిరా శర్మ తల్లి సానియా శర్మ విజ్ఞప్తి చేశారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా విలేకరులు ఈ అంశంపై ప్రశ్నించగా ఆమె స్పందిస్తూ, "అసలు మీరేం మాట్లాడుతున్నారు? బయటి వ్యక్తులు అనేక విషయాలు చెబుతుంటారు. నా కుమార్తె ఇప్పుడు ఒక సెలబ్రిటీ. దీంతో అభిమానులు ఆమెకు ఎవరితోనో సంబంధాలు అంటగడుతుంటారు. వాటిని నమ్మాలా? ఇలాంటి వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం" అని ఖండించారు.