నిర్మాత నాగవంశీని వెంటాడుతున్న 'స్లీప్‌లెస్' కామెంట్స్!
- ఈ వారం బాలీవుడ్‌లో విడుదలైన 'డాకు మహారాజ్'
- 'డాకు మహారాజ్' నార్త్ ఇండియా కలెక్షన్ల విషయంలో నాగవంశీపై ట్రోల్స్
- మరోసారి తెరపైకి వచ్చిన నాగవంశీ 'స్లీప్‌లెస్' కామెంట్స్
''పుష్ప-2 చిత్రం బాలీవుడ్‌లో సింగిల్ డేలో రూ. 80 కోట్లు కలెక్ట్ చేయడంతో బాలీవుడ్‌లో చాలా మంది ప్రముఖులకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు" అని నాగవంశీ ఆ రౌండ్ టేబుల్ వ్యాఖ్యానించడంపై బాలీవుడ్ ప్రముఖులు సిద్దార్థ్ ఆనంద్, సంజయ్ గుప్తా, హన్సల్ మెహతా వంటి వాళ్లు ఈ యంగ్ ప్రొడ్యూసర్ కామెంట్స్‌ను విమర్శించారు. అయితే తాజాగా నాగవంశీపై మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపిస్తున్నాయి.
నందమూరి బాలకృష్ణతో బాబీ దర్శకత్వంలో ఆయన నిర్మించిన 'డాకు మహారాజ్' చిత్రాన్ని ఈ వారం నార్త్ ఇండియాలో విడుదల చేశాడు. ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో కేవలం రూ.20 లక్షల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసిందని తెలిసింది. ఇప్పుడు నాగవంశీ 'పుష్ప-2' విషయంలో చేసిన కామెంట్స్‌కు ప్రతిస్పందనగా ఇప్పుడు నాగవంశీ తన సినిమా కలెక్షన్స్ చూస్తే నిజంగానే నిద్ర పట్టదు అంటూ ఆ స్లీప్‌లెస్ కామెంట్స్‌ను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.