బంజారాహిల్స్‌లో ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి
- ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తి మృతి
- మరో ఇద్దరికి గాయాలు... ఆసుపత్రికి తరలింపు
- కారును అక్కడే వదిలేసి పారిపోయిన నిందితులు
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. కారు ఎవరిది? ప్రమాదం ఎలా జరిగింది? పరారైన నిందితులు ఎవరు? అనే కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.