అతి తక్కువ బడ్జెట్ .. 60 కోట్ల వసూళ్లు!
- మలయాళంలో రూపొందిన 'పని'
- థియేటర్ల నుంచి లభించిన హిట్
- ఈ నెల 16 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్
- యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో మెప్పించిన కంటెంట్
- జోజు జార్జ్ దర్శకత్వం వహించిన ఫస్టుమూవీ ఇది
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, కథాకథనాల పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అభినయ .. సాగర్ సూర్య .. అభయ హిరణ్మయి ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ రివేంజ్ డ్రామా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి దీనిని 'సోనీలివ్'లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. మలయాళంతో పాటు, తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషలలోను అందుబాటులోకి వస్తోంది.
ఈ సినిమాలో 'గిరి' అనే పాత్రలో జోజు జార్జ్ కనిపిస్తాడు. త్రిసూర్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అక్కడ రెండు గ్యాంగుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆ ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో బ్రతుకుతూ ఉంటారు. ఆ గొడవ గిరి దంపతులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వారి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుంది? అనేది కథ.