ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
- ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి
- కిషన్ రెడ్డిని కలిసినప్పుడు సీఎం వెంట కాంగ్రెస్ ఎంపీలు
- వరుసగా కేంద్రమంత్రులను కలుస్తున్న ముఖ్యమంత్రి
కిషన్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పారు. రేవంత్ రెడ్డికి కూడా కిషన్ రెడ్డి శాలువా కప్పారు. అనంతరం ఇరువురు కాసేపు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆ తర్వాత కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు.