మళ్లీ గెలిపిస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2,100 ఇస్తాం: కేజ్రీవాల్ హామీ
- సీఎం అతిశీతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్
- రూ.2,100 మహిళ ఖాతాలోకి నేరుగా జమ చేస్తామని వెల్లడి
- కొందరు మహిళల అభ్యర్థన మేరకు ఈ హామీ ఇచ్చినట్టు వెల్లడి
ముఖ్యమంత్రి అతిశీతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ నేడు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతి మహిళకు రూ.1,000 ఇస్తామని గతంలో హామీ ఇచ్చామని, అయితే కొంతమంది మహిళలు తన వద్దకు వచ్చి ద్రవ్యోల్బణం కారణంగా ఈ మొత్తం సరిపోదని చెబుతున్నారని తెలిపారు. వారి అభ్యర్థన మేరకు పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలకు రెండింతల కంటే ఎక్కువ పెంచినట్లు తెలిపారు.