ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్!
- జోజూ జార్జ్ హీరోగా రూపొందిన 'పణి'
- స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమా
- 25 కోట్లకు పైగా వసూలు చేసిన కంటెంట్
- స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న సోనీలివ్
- డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేసే ఛాన్స్
ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'సోనీ లివ్' దక్కించుకుందనీ, డిసెంబర్ 20వ తేదీ నుంచి మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని సమాచారం. జోజూ జార్జ్ కి భార్య పాత్రలో 'అభినయ' కనిపించనుండటం విశేషం.
ఈ సినిమాలో 'గిరి' అనే పాత్రలో జోజూ జార్జ్ నటించాడు. గిరి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. భార్య గౌరితో ఆయన జీవితం హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అతని మిత్రుడు అత్యంత దారుణంగా హత్య చేయబడతాడు. ఆ హత్య ఎవరు చేస్తారు? అది తెలుసుకున్న గిరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.