ప్రధానితో సమావేశంపై పవన్ కల్యాణ్ స్పందన
- పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన
- ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం
- ప్రధాని ఎంతో విలువైన సమయాన్ని కేటాయించారన్న పవన్
"ప్రధాని మోదీని నేను మొదటిసారిగా గాంధీనగర్ లో కలిశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయనతో ప్రతి సమావేశం ఎంతో సుహృద్భావ వాతావరణంలో జరిగేది. ప్రతి సమావేశం తర్వాత కూడా ఆయన పట్ల ఆరాధనా భావం కలిగేది. దేశం పట్ల ఆయన ప్రేమ, నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకం" అని పవన్ కల్యాణ్ వివరించారు.
