ఘనంగా మురళీమోహన్ మనవరాలు, కీరవాణి కుమారుడి ప్రీవెడ్డింగ్ సెలెబ్రేషన్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఘనంగా మురళీమోహన్ మనవరాలు, కీరవాణి కుమారుడి ప్రీవెడ్డింగ్ సెలెబ్రేషన్స్

Simha and Raga pre wedding celebrations
  • మురళీమోహన్, కీరవాణి ఇంట మోగనున్న పెళ్లిబాజాలు
  • నిన్న రాత్రి గోల్కొండ రిసార్ట్స్ లో ప్రీవెడ్డింగ్ సెలెబ్రేషన్స్
  • వేడుకకు హాజరైన రఘురాజు, మహేశ్ బాబు, రాజమౌళి తదితరులు
ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్, ఆస్కార్ విన్నర్ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. మురళీమోహన్ మనవరాలు రాగ, కీరవాణి చిన్న కుమారుడు సింహాల వివాహం త్వరలోనే జరగనుంది. ఈ క్రమంలో నిన్న రాత్రి గోల్కొండ రిసార్ట్స్ లో ప్రీవెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 

ఈ వేడుకకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, సినీ నటుడు మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళి, నరేశ్, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. 

మురళీమోహన్ కుమారుడు రామ్ మోహన్ కు ఏకైక కుమార్తె రాగ. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో ఆమె మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం మురళీమోహన్ కుటుంబానికి చెందిన వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 

కీరవాణి కుమారుడు సింహా తొలుత దర్శకత్వ విభాగంలో పని చేసి... ఆ తర్వాత నటుడిగా మారారు. తెల్లవారితే గురువారం, మత్తు వదలరా, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్, మత్తు వదలరా2 చిత్రాల్లో హీరోగా నటించారు.
Advertisement
Murali Mohan
Keeravani
Tollywood
Mahesh Babu

More Telugu News