ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అదానీ గ్రూప్ సంస్థల అధినేతలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అదానీ గ్రూప్ సంస్థల అధినేతలు

Adani Group firms MDs met AP CM Chandrababu
  • చంద్రబాబుతో రాజేశ్ అదానీ, కరణ్ అదానీ సమావేశం
  • ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చ
  • కీలక రంగాల్లో పెట్టుబడులపై ప్రజంటేషన్
అదానీ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ ఎండీ రాజేశ్ అదానీ, అదానీ పోర్ట్స్, సెజ్ లిమిటెడ్ ఎండీ కరణ్ అదానీ నేడు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై వారు చర్చించారు. 

పోర్టులు, మైనింగ్, రింగ్ రోడ్, ఐటీ, టూరిజం, ఏఐ వంటి కీలక రంగాల్లో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు అందించే ప్రాజెక్టుల ఏర్పాటుపై వారు సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చారు. 

అంతేకాకుండా, అమరావతి పునర్ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని, స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్ సాకారం చేసేందుకు తమవంతు సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ మేరకు అదానీలతో సమావేశంపై చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 
Advertisement
Chandrababu
Rajesh Adani
Karan Adani
Adani Exports
Adani Ports
Amaravati
Andhra Pradesh

More Telugu News