నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' టీజ‌ర్ విడుద‌ల‌

Appudo Ippudo Eppudo Official Teaser
  • నిఖిల్ సిద్ధార్థ్, సుధీర్ వ‌ర్మ కాంబోలో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’
  • న‌వంబ‌ర్ 8న  ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న చిత్రం
  • ఒక మంచి ప్రేమ‌క‌థ‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మూవీ
యువ న‌టుడు నిఖిల్ సిద్ధార్థ్, ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ కాంబోలో వ‌స్తున్న‌ తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 8న  ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రం యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తాజాగా టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

టీజ‌ర్‌లో హీరో నిఖిల్ రేస‌ర్‌గా క‌నిపించాడు. ఒక మంచి ప్రేమ‌క‌థ‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నట్లు టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇక క‌న్న‌డ డబ్బింగ్ చిత్రం 'స‌ప్త సాగ‌రాలు దాటి' సినిమాతో తెలుగువారిని కూడా ఆక‌ట్టుకున్న‌ రుక్మిణి వ‌సంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

మ‌రో క‌థానాయిక‌గా దివ్యాంశ కౌశిక్ న‌టిస్తుండ‌గా... క‌మెడియ‌న్ వైవా హ‌ర్ష కీల‌క పాత్ర‌లో న‌టించాడు. టాలీవుడ్ బ‌డా బ్యాన‌ర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడ‌క్ష‌న్స్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కార్తీక్ బాణీలు అందిస్తున్నాడు. 

Go Back to Shorts
Appudo Ippudo Eppudo
Nikhil
Tollywood
Sudheer Varma

More Telugu News