కెనడాలో మన విద్యార్థుల దీనావస్థ.. వెయిటర్ జాబ్ కోసం హోటల్ ముందు భారీ క్యూ.. వీడియో ఇదిగో!
- ఎన్నో ఆశలతో కెనడా బయల్దేరే విద్యార్థులు పునరాలోచించుకోవాలంటూ ట్వీట్
- వెయిటర్, సర్వెంట్ ఉద్యోగాల కోసం 3 వేల మంది క్యూ కట్టారని వెల్లడి
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఇందులో చాలావరకు భారత విద్యార్థులే ఉన్నారని వివరించారు. కెనడాలో నిరుద్యోగాన్ని, భారత విద్యార్థుల అవస్థలను ఈ వీడియో కళ్లకు కట్టినట్లు చూపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. కెనడాలోని యూనివర్సిటీలలో ఉన్నత విద్య కోసం వచ్చే భారతీయ విద్యార్థులు పునరాలోచించుకోవాలని ఈ ట్విట్టర్ యూజర్ హెచ్చరించారు. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇది సరైన సమయం కాదంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. అయితే, మరికొంతమంది మాత్రం ఆ విద్యార్థులకు మద్దతు తెలిపారు.
విదేశాల్లో చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేయడం సాధారణ విషయమని కామెంట్లు పెడుతున్నారు. తమ చదువుకు, తిండికి అయ్యే ఖర్చును విద్యార్థులు ఇలా సంపాదించుకుంటారని వివరించారు. రెస్టారెంట్ ముందు లైన్ లో నిలుచున్న విద్యార్థులలో కొంతమంది గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం నిజమే కావొచ్చు అయినప్పటికీ వారు భవిష్యత్తులో మెరుగైన జీవితం గడుపుతారని, చిన్న ఉద్యోగమే అయినప్పటికీ ఇలా క్యూలో నిలుచోవడం వారి కష్టపడే మనస్థత్వాన్ని తెలియజేస్తోందని మరికొందరు కామెంట్ చేశారు.