ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ... పాకిస్థాన్ పై ఇండియా విజయం
- చైనాలో జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ
- పాక్ పై మ్యాచ్ లో రెండు గోల్స్ చేసిన హర్మన్ ప్రీత్ సింగ్
- ఒక్క ఓటమి కూడా లేకుండా సెమీస్ లో అడుగు పెట్టిన ఇండియా
ఇండియా తరపున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. పాక్ తరపున అహ్మద్ నదీమ్ ఒక గోల్ సాధించాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో ఇండియా ఇప్పటికే సెమీస్ కు చేరింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ సెమీస్ లో అడుగుపెట్టింది.