ఎవరూ సెలవు పెట్టొద్దు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
--
వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదురైతే ఫోన్ ద్వారా అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వరదలతో ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.