బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీమంత్రి.. గంటల్లోనే బహిష్కరణ
- ముఖ్యమంత్రి నవావ్‌సింగ్ సైనీ సమక్షంలో నిన్న బీజేపీలో చేరిన సందీప్‌కుమార్
- పూర్వాపరాలు దాచిపెట్టి పార్టీలో చేరినందుకు ఆరు గంటల్లోనే బహిష్కరణ వేటు
- మహిళతో అసభ్యకరంగా ఉన్న సీడీ వెలుగులోకి రావడంతో 2016లో వేటేసిన ఆమ్ ఆద్మీ పార్టీ
- 2019లో సందీప్‌కుమార్‌పై అనర్హత వేటు వేసిన ఢిల్లీ స్పీకర్
2016లో ఆప్ నుంచి బహిష్కరణ
ప్రస్తుతం బీజేపీ బహిష్కరించిన సందీప్‌కుమార్‌ను 2016లో ఆప్ బహిష్కరించింది. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న సందీప్ ఓ మహిళతో అసభ్యకరంగా ఉన్న సీడీ ఒకటి వెలుగులోకి వచ్చింది. సందీప్ తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆ సీడీలో ఉన్న మహిళ ఆరోపించారు. ఇదే కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. దీంతో పార్టీ నుంచి ఆయనను బహిష్కరించారు. 2019లో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న సందీప్ కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీకి మద్దతు తెలిపినందుకు అప్పటి శాసనసభ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ అనర్హత వేటు వేశారు.