ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి నేడు బెంగళూరుకు మాజీ సీఎం జగన్!
కాగా అధికారం కోల్పోయిన తర్వాత జగన్ పదేపదే బెంగళూరు వెళ్లడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదివరకు రెండు సార్లు జగన్ బెంగళూరు వెళ్లి రావడం గమనార్హం. ఇదిలావుంచితే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో కొందరిని బెంగళూరులో క్యాంపునకు తరలించిన విషయం తెలిసిందే.