హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన: వాతావరణ శాఖ

imd expects rainfall in telangana
  • ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం
  • భానుడి భగభగ నుంచి చల్లబడిన తెలంగాణ జిల్లాలు
  • ఉరుములతో కూడిన వర్షాలు కురవొచ్చని వెల్లడి
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా, ఆ తర్వాత ఆకాశం మేఘావృతమైంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రకటన చేసింది.

హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రానున్న రెండు, మూడు గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షాలు కురవొచ్చని తెలిపింది.

తెలంగాణలో ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావం నెలకొందని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
Go Back to Shorts
imd expects rainfall
Telangana Rains

More Telugu News