నేనేమైనా ప్రియాంక చోప్రానా? వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి: రాఖీ సావంత్

Rakhi Sawant Am I Priyanka Chopra to Marry a Younger Man
  • ఇప్పటికే రాఖీ సావంత్ రెండు పెళ్లిళ్లు విఫలం
  • తాను తన వయసు వారినే ఇష్టపడతానన్న రాఖీ
  • కుర్రాళ్లు తనకు నచ్చరని వ్యాఖ్య

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ రాఖీ సావంత్ రెండు పెళ్లిళ్లు పెటాకులు అయిన సంగతి తెలిసిందే. తాజాగా రాఖీ సావంత్ ఒక ఇంటర్వ్యూలో తన మూడో పెళ్లి గురించి మాట్లాడుతూ బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రాపై సెటైర్లు వేసింది. తన కంటే వయసులో చాలా చిన్నవాడైన నిక్ జోనాస్‌ను ప్రియాంక పెళ్లి చేసుకోవడాన్ని ఉద్దేశించి రాఖీ వ్యంగ్యంగా స్పందించింది. 


"నా వెంట 16, 17 ఏళ్ల కుర్రాళ్లు పడుతుంటారు. కానీ నాకు అలాంటి వారు నచ్చరు. ఒక కుర్రాడిని బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకోవడానికి నేనేమీ ప్రియాంక చోప్రాని కాదు. నా వయసు వారినే నేను ఇష్టపడతాను" అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ప్రియాంక చోప్రా తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ, ఆమెను ఇలాంటి వివాదంలోకి లాగడంపై ప్రియాంక ఫ్యాన్స్ రాఖీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Go Back to Shorts
Rakhi Sawant
Priyanka Chopra
Nick Jonas
Bollywood
Marriage
Age gap
Celebrity gossip
Rakhi Sawant interview
Bollywood news
Entertainment

More Telugu News