బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానుల మధ్య జులై 31న భేటీ... ఐపీఎల్ 2025కి సన్నాహాలు మొదలు!
- ఆటగాళ్ల రిటెయిన్ రూల్స్‌పై చర్చించే అవకాశం
- ఐదుగురి కంటే ఎక్కువ మందిని రిటెయిన్ చేసుకునేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్న ఫ్రాంచైజీలు
- వేలానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదని భావిస్తున్న బీసీసీఐ
- 31న జరిగే భేటీలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
రిటెన్షన్ విషయంలో జట్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ఐదు కంటే ఎక్కువ మందిని రిటెయిన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయని ఆ కథనం పేర్కొంది. ఎనిమిది మంది ఆటగాళ్లను రిటెయిన్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని జట్లు కోరుతున్నాయని, అయితే ఇదే జరిగితే ఆటగాళ్ల వేలానికి పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవచ్చని బీసీసీఐ భావిస్తోందని తెలిపింది. కాబట్టి ఆటగాళ్ల రిటెయిన్ సంఖ్యపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నప్పటికీ పాత నిబంధన ప్రకారం ఐదుగురికే కట్టుబడి ఉండే అవకాశం ఉందని క్రిక్‌బజ్ కథనం విశ్లేషించింది.
ఇదిలావుంచితే.. వివాదాస్పద అంశంగా ఉన్న రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) కార్డుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నిబంధన కింద తమ జట్టులోని ఆటగాడిని వేలానికి ఉంచి అతడికి పలికిన ధర చెల్లించి తిరిగి ఆ ఆటగాడిని దక్కించుకునే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుంది. ఐపీఎల్ -2018లో ఆర్టీఎం కార్డ్ నిబంధనను ప్రవేశపెట్టారు. ఆటగాళ్లకు మంచి జరుగుతుందని భావిస్తున్న ఈ నిబంధనను 2021 మెగా వేలంలో అమలు చేయలేదు. ఆర్‌టీఎం కార్డు నిబంధన ప్రకారం... ఒక ఆటగాడి రేటుని పెంచడానికి మాత్రమే ఇతర ఫ్రాంచైజీలు ఉపయోగపడతాయి. కానీ వారిని దక్కించుకునేందుకు అవకాశం ఉండదు. అయితే ఈ నిబంధన విషయంలో జట్లను బీసీసీఐ ఏకతాటిపైకి తీసుకురావడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.