వంగలపూడి అనిత ముందు ఏడ్చేశా: హోంమంత్రిని కలిసిన అనంతరం శాంతి భర్త
- ప్రాణాలకు ముప్పు ఉంది... రక్షణ కల్పించాలని కోరిన మదన్ మోహన్
- తన కుటుంబానికి న్యాయం చేయమని కోరినట్లు వెల్లడి
- తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆందోళన
నాలుగు రోజులుగా జరుగుతున్న అంశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి తనతో చెప్పారన్నారు. తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని మేడం గ్యారెంటీ ఇచ్చారన్నారు. ఓ సమయంలో ఎమోషనల్ అయి మేడం వద్దనే తాను ఏడ్చానని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు గుర్తు తెలియని నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు.
తాను అమెరికాలో ఉన్నప్పుడు ఝాన్సీని తన బిడ్డగానే తన భార్య శాంతి చెప్పిందన్నారు. దీంతో ఆ బిడ్డతో ఎమోషనల్‌గా అటాచ్ అయ్యానన్నారు. తనను నయవంచనకు గురి చేశారన్నారు. ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కన్నట్లు మొదట చెప్పిందని, ఆ తర్వాత మాటలు మార్చిందన్నారు. పూర్తిగా ఆరా తీయడంతో అసలు విషయం చెప్పిందన్నారు. ఏ భర్త కూడా బయటకు వచ్చి తన భార్యపై అపనింద వేయరని గుర్తుంచుకోవాలన్నారు.