Soft drinks: 721 కోట్ల లీటర్ల కూల్​ డ్రింక్స్​​.. మన వాళ్లు అంత తాగేస్తారా?

india soft drinks consumption volume
షార్ట్స్‌లో చూడండి
ఇంట్లోంచి బయటికి వెళ్లినా.. ఇంటికెవరు చుట్టాలు వచ్చినా.. కాస్త ఎండ వేడిగా ఉన్నా.. కూల్ డ్రింక్ గొంతులో పడాల్సిందే. అలా మారిపోయింది పరిస్థితి. ఇండియాలో ఏటేటా కూల్ డ్రింక్ ల వినియోగం బాగా పెరిగిపోతోంది. ఇక 2024లో మన దేశ ప్రజలు ఏకంగా 721 కోట్ల లీటర్ల కూల్ డ్రింకులను తాగేయబోతున్నారట. స్టాటిస్టా గణాంకాల సంస్థ ఈ మేరకు అంచనాలు వేసింది. గత పదేళ్లలో తాగేసిన కూల్ డ్రింకులు ఎన్ని లీటర్లు? వచ్చే మూడేళ్లలో ఎంత మేర తాగేస్తారనే లెక్కలు పేర్కొంది. అవేమిటో చూద్దామా..

కూల్ డ్రింకుల వినియోగం తీరు ఇదీ..
  • 2014లో 561 కోట్ల లీటర్లు
  • 2015లో 590 కోట్ల లీటర్లు
  • 2016లో 606 కోట్ల లీటర్లు
  • 2017లో 649 కోట్ల లీటర్లు
  • 2018లో 663 కోట్ల లీటర్లు
  • 2019లో 682 కోట్ల లీటర్లు
  • 2020లో 626 కోట్ల లీటర్లు
  • 2021లో 668 కోట్ల లీటర్లు
  • 2022లో 675 కోట్ల లీటర్లు
  • 2023లో 694 కోట్ల లీటర్లు
  • 2024లో 721 కోట్ల లీటర్లు (అంచనా)
  • 2025లో 744 కోట్ల లీటర్లు (అంచనా)
  • 2026లో 766 కోట్ల లీటర్లు (అంచనా)
  • 2027లో 782 కోట్ల లీటర్లు (అంచనా)
Go Back to Shorts
Soft drinks
india
cold drinks
national
offbeat

More Telugu News