కేంద్రంతో రేవంత్ రెడ్డి కుమ్మక్కై సింగరేణిని నష్టాల్లోకి నెట్టే కుట్ర చేస్తున్నారు: కేటీఆర్
- సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం బొగ్గు గనులను వేలం వేసిందని విమర్శ
- సింగరేణికి గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నమని వ్యాఖ్య
- సింగరేణి నష్టాల్లో ఉందంటూ ఆ తర్వాత పెట్టుబడుల ఉపసంహరణకు యత్నిస్తారని ఆరోపణ
సింగరేణి నష్టాల్లో ఉందని ఆ తర్వాత పెట్టుబడుల ఉపసంహరణకు యత్నిస్తారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలతో కేసీఆర్ ఉద్యమం నుంచే పని చేస్తున్నారని పేర్కొన్నారు. సమ్మె సమయంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నీ ఉద్యమ కాలంలో అద్భుతంగా పని చేశాయని కేటీఆర్ కితాబునిచ్చారు.