సుస్మిత‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నా..'ప‌రువు' వెబ్‌సిరీస్‌పై చిరు ఆస‌క్తిక‌ర‌ కామెంట్స్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సుస్మిత‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నా..'ప‌రువు' వెబ్‌సిరీస్‌పై చిరు ఆస‌క్తిక‌ర‌ కామెంట్స్‌!

Mega star Chiranjeevi Tweet on Paruvu Web Series
  • సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి స్పందన
  • జూన్ 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ‘పరువు’ వెబ్ సిరీస్‌
  • ఈ సిరీస్‌కు సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ద‌ర్శ‌క‌త్వం
  • విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మాణం
  • వెబ్ సిరీస్‌లో కీల‌క పాత్ర‌ల్లో నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య
గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ మీద విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన జీ5 ఒరిజినల్ సిరీస్ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ఈ సిరీస్‌కు దర్శకులు. ఈ వెబ్ సిరీస్‌లో నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి వంటి వారు ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ జీ5 ఒరిజినల్ సిరీస్ జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 

ఈ వెబ్ సిరీస్ ఎంతో గ్రిప్పింగ్‌గా ఉండటం.. ఉత్కంఠ భరితంగా సాగడంతో వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంది. దీంతో రెండో సీజన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా పరువు వెబ్ సిరీస్‌ను చూసిన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రెండో సీజన్ కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నానని తెలిపారు.

ఒక చక్కటి ప్లాన్‌తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు.. అదే విషయమై ఎమ్మెల్యే గారి పాట్లు.. చివరకి ఈ జంట తప్పించుకుందా? లేదా? అని సీజన్‌2లోనే చూడాలనుకుంటా అని తన ఎగ్జైట్మెంట్‌ను పంచుకున్నారు. 

"పరువు చాలా పెద్ద సక్సెస్ అయింది. తెలుగు ఓటీటీలో అద్భుతమైన కంటెంట్‌ను ఇస్తున్న సుష్మిత కొణిదెలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. నా ప్రియమైన సోదరుడు నాగబాబు అద్భుతంగా నటించారు" అని చిరు ట్వీట్ చేశారు.
Advertisement
Chiranjeevi
Paruvu Web Series
Zee5
Tollywood

More Telugu News