'బెంగళూరు రేవ్ పార్టీతో నాకేం సంబంధంలేదు' అంటున్న హేమ.. వీడియో ఇదిగో!
- హైదరాబాద్ లోనే ఓ ఫాంహౌస్ లో చిల్ అవుతున్నానంటూ వీడియో రిలీజ్ చేసిన నటి
- కన్నడ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దని కోరిన హేమ
- రేవ్ పార్టీలో ఎవరున్నారనేది తనకు తెలియదని వ్యాఖ్య
బెంగుళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతోందనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులలో దాదాపు వందమందికి పైగా పట్టుబడ్డారని, అందులో తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారని సమాచారం. ఇందులో నటి హేమ కూడా ఉందంటూ కన్నడ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీంతో తనకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధంలేదని నటి హేమ వివరణ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.