జగన్‌కు టీడీపీ నేత బొండా ఉమ సరికొత్త సవాల్!
- ఒకవేళ కూటమి గెలిస్తే.. జగన్ వైసీపీని మూసేస్తానని ప్రకటించాలంటూ బొండా ఉమ డిమాండ్
- పరాజయం తప్పదనే భయం బొత్స, పెద్దిరెడ్డి ముఖాలలో స్పష్టంగా కనిపిస్తోందంటూ టీడీపీ నేత చురకలు
- వైసీపీ ఐదేళ్ల పాలనలో సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పితే ఇంకెవరూ బాగుపడలేదని ధ్వజం
ఈసారి తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని చెబుతున్న సీఎం జగన్.. ఒకవేళ కూటమి గెలిస్తే వైసీపీని మూసేస్తానని కూడా ప్రకటించాలని సవాల్ చేశారు. పరాజయం తప్పదనే భయం ఆ పార్టీ కీలక నేతలైన బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి ముఖాలలో స్పష్టంగా కనిపిస్తోందని బొండా ఉమ చురకలంటించారు. ఇక వైసీపీ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు తప్పితే ఇంకెవరూ బాగుపడలేదని ధ్వజమెత్తారు.