విజయవాడలో ముగిసిన మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో
- ఏపీలో ముగిసిన ప్రధాని మోదీ ప్రచార పర్వం
- విజయవాడలో మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్ షో
- ప్రజాగళం రోడ్ షోలో పాల్గొన్న మోదీ, చంద్రబాబు, పవన్
- ఒకే వాహనంపై ముగ్గురు అగ్రనేతలు
కాగా, ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ పాల్గొన్న రోడ్ షోకు విశేష స్పందన లభించింది. అంచనాలకు మించి సక్సెస్ అయ్యిందన్న ఆనందం కూటమి నేతల్లో వెల్లివిరిసింది. ఈ రోడ్ షోతో ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం ముగిసినట్టయింది. రాష్ట్రంలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే రోజున లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.