అధికారంలోకి వచ్చాక గులకరాయి డ్రామా గూడుపుఠానీని బయటపెడతాం: అచ్చెన్నాయుడు
- బొండా ఉమను కావాలనే జగన్ వేధిస్తున్నారన్న అచ్చెన్నాయుడు
- పోలీసు అధికారులు వేధింపులు ఆపాలని హెచ్చరిక
- తెలంగాణలో ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఏమైందో గమనించాలని సూచన
కూటమి నేతలపై పోలీసు అధికారులు వేధింపులు ఆపాలని... లేకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జగన్ చెప్పిన మాటలు విని అధికారులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. తెలంగాణలో ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఏమైందో గమనించాలని సూచించారు. మరో నెల రోజుల్లో తమ ప్రభుత్వం వస్తుందని... గులకరాయి డ్రామా గూడుపుఠానీ బయటపెడతామని చెప్పారు. ఈ డ్రామాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన వారికి తగు రీతిలో సన్మానం చేస్తామని అన్నారు.