కాగితాల్లోనే దళితబంధు.. డబ్బులు ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపణ
- లబ్దిదారులను ఎంపిక చేసి పెండింగ్ లో పెట్టారని వివరణ
- బీఆర్ఎస్ హయాంలో చివరి రెండేళ్లు పైసా కూడా రిలీజ్ చేయలేదని విమర్శ
- వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ సూచన
మాజీ సీఎం కేసీఆర్ ఆరోపణల్లో వాస్తవం లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. గత ప్రభుత్వం ఏయే స్కీంలు ఎంత ఆలస్యం చేసిందనే వివరాలను ఆయా శాఖలవారీగా ప్రజలకు వెల్లడించాలని సీఎం సూచించారు. 2022-23లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు స్కీంలో భాగంగా 1500 మంది లబ్ధిదారులకు రూ.17,700 కోట్లు కేటాయించింది. 2023-24 బడ్జెట్లోనూ అంతే కేటాయించింది. రెండేళ్లకు సంబంధించి మొత్తం రూ.35 వేల కోట్లు లబ్దిదారులకు ఇవ్వాల్సి ఉండగా.. ఒక్క లబ్దిదారుడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అధికారులు వివరించారు. దీంతో దాదాపు రూ.35 వేల కోట్ల నిధులు కొలాప్స్ అయ్యాయని చెప్పారు. బతుకమ్మ చీరలకు సంబంధించి సుమారు 488.38 కోట్లు బకాయిలను కూడా చెల్లించలేదని ఆరోపించారు.