జగన్ బస్సు యాత్రపై అంబటి రాయుడు ట్వీట్

జగన్ బస్సు యాత్రపై అంబటి రాయుడు ట్వీట్

Ambati Rayudu tweet on Jagan bus yatra
  • 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రను ప్రారంభించిన జగన్
  • 'సిద్ధం' అంటూ అంబటి రాయుడు ట్వీట్
  • రాయుడు మళ్లీ వైసీపీలో చేరుతున్నారా అంటూ నెటిజెన్ల ప్రశ్నలు
త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 'మేమంతా సిద్ధం' పేరుతో బస్సు యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి జగన్ బస్సు యాత్ర కాసేపటి క్రితం ప్రారంభమయింది. మరోవైపు, జగన్ బస్సు యాత్ర గురించి టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ ఉదయం ఎక్స్ వేదికగా స్పందించారు. 'సిద్ధం' అంటూ రాయుడు ట్వీట్ చేశారు. 

గతంలో అంబటి రాయుడు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. జగన్ సమక్షంలోనే ఆయన వైసీపీలో చేరారు. అయితే రోజుల వ్యవధిలోనే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. కొంత కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని అప్పట్లో ఆయన ప్రకటించారు. ఇప్పుడు తాజా ట్వీట్ తో ఆయన పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. రాయుడు ట్వీట్ పట్ల చర్చ జరుగుతోంది. మళ్లీ వైసీపీలో చేరుతారా? అని రాయుడుని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.
Advertisement
ambati Rayudu
YSRCP
Siddham

More Telugu News