మోకాళ్ల‌పై మెట్లెక్కి.. తిరుమ‌ల స్వామి వారిని ద‌ర్శించుకున్న‌ జాన్వీక‌పూర్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోకాళ్ల‌పై మెట్లెక్కి.. తిరుమ‌ల స్వామి వారిని ద‌ర్శించుకున్న‌ జాన్వీక‌పూర్‌

Janhvi Kapoor climbs Tirupati Temple on her Knees with Shikhar Pahariya
  • ఈ నెల 6న త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్నేహితుల‌తో క‌లిసి స్వామి వారిని ద‌ర్శించుకున్న జాన్వీ 
  • స్నేహితులు శిఖ‌ర్ ప‌హారియా, ఒరీతో క‌లిసి స్వామి వారి సేవ‌లో పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ
  • ఆ స‌మ‌యంలోనే జాన్వీ-శిఖ‌ర్ మోకాళ్ల‌పై మెట్లెక్కారు
  • ప్ర‌స్తుతం ఎన్టీఆర్, చ‌ర‌ణ్ స‌ర‌స‌న రెండు తెలుగు సినిమాల్లో న‌టిస్తున్న జాన్వీక‌పూర్‌
అతిలోక సుంద‌రి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ క‌పూర్ త‌ర‌చూ ద‌ర్శ‌నం కోసం తిరుమ‌లకు వ‌స్తుంటార‌నే విష‌యం తెలిసిందే. ఈ నెల 6న కూడా జాన్వీ త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్నేహితుల‌తో క‌లిసి స్వామి వారిని ద‌ర్శించుకుంది. త‌న స్నేహితులు శిఖ‌ర్ ప‌హారియా, ఒరీతో క‌లిసి వెంక‌టేశ్వ‌ర స్వామి వారి సేవ‌లో పాల్గొన్నారు. 

ఇలా స్వామి వారి సేవ‌లో పాల్గొన్న స‌మ‌యంలో తీసిన ఓ వీడియోను ఒరీ తాజాగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. తిరుమ‌ల యాత్ర ఎలా జ‌రిగిందో అందులో వివ‌రించిందామె. చెన్నైలోని జాన్వీ క‌పూర్ ఇంటి నుంచి కారులో మూడు గంట‌ల ప్ర‌యాణం త‌ర్వాత తిరుమ‌ల చేరుకున్న‌ట్లు ఆమె పేర్కొంది. 

ఆ త‌ర్వాత జాన్వీ బంధువుల‌తో క‌లిసి న‌డ‌క దారిన తిరుమ‌ల చేరుకున్నామ‌ని తెలిపింది. ఈ క్ర‌మంలో మోకాళ్ల మిట్ట వ‌ద్ద జాన్వీ-శిఖ‌ర్ మోకాళ్ల‌పై మెట్లెక్కారు. దాదాపు 50సార్లు తానుకు ఇక్క‌డికి వ‌చ్చిన‌ట్లు ఒరీ తెలియ‌జేసింది. ఈ దేవాల‌యం అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని కూడా ఆమె చెప్పుకొచ్చింది. 

ఇక ప్ర‌స్తుతం జాన్వీ రెండు బ‌డా తెలుగు సినిమాల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అందులో ఒక‌టి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న దేవ‌ర చిత్రం కాగా, మ‌రొక‌టి గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌తో. ఈ మూవీని ఉప్పెన ఫేం బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బుధ‌వారం ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మం జ‌రుపుకుంది. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం జాన్వీ త‌న తండ్రి బోనీ క‌పూర్‌తో క‌లిసి చెర్రీ నివాసానికి వెళ్లింది. అక్క‌డ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబుతో పాటు ఇత‌ర చిత్ర‌యూనిట్‌తో క‌లిసి కొద్దిసేపు స‌ర‌దాగా గ‌డిపారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను జాన్వీక‌పూర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది.
Advertisement
Janhvi Kapoor
Tirupati Temple
Shikhar Pahariya
Tirumala
Tollywood

More Telugu News