ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డిపై కేసు నమోదు
- ఏపీలో కోడ్ అమలు
- ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో శివప్రసాదరెడ్డిపై కేసు
- అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం చేసినట్టు గుర్తింపు
వాలంటీరు ఆధ్వర్యంలో వైసీపీలో చేరికలు... అధికారుల వేటు
ప్రొద్దుటూరులో వాలంటీరు సుబ్బారావు ఆధ్వర్యంలో వైసీపీలో చేరికలు జరిగాయి. సుబ్బారావు స్థానిక వివేకానంద కాలనీలో పలువురిని వైసీపీలో చేర్చినట్టు గుర్తించారు. వైసీపీ కండువా వేసుకున్న సుబ్బారావు పార్టీ నేతలతో ఫొటో దిగాడు. సుబ్బారావు కొత్తపల్లి పంచాయతీ పరిధిలో వాలంటీరుగా వ్యవహరిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమం చేపట్టిన వాలంటీరు సుబ్బారావుపై కేసు నమోదైంది. దాంతో, వాలంటీరు సుబ్బారావును అధికారులు విధుల నుంచి తొలగించారు.