ఈ సినిమా నాకు బాగా నచ్చింది: రాజమౌళి
- 'ప్రేమలు' పేరుతో విడుదలైన మలయాళం సూపర్ హిట్ సినిమా
- తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన కార్తికేయ
- రీను పాత్ర చేసిన అమ్మాయి తనకు బాగా నచ్చిందన్న రాజమౌళి
ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన 'ప్రేమలు' చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేశారు. ఈ చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఒక ట్వీట్ చేశారు. సినిమా తనకు బాగా నచ్చిందని చెప్పారు. ట్రైలర్ చూసినప్పుడే రీను పాత్ర చేసిన అమ్మాయి తనకు బాగా నచ్చిందని తెలిపారు.