పాతబస్తీలో మెట్రో రైలు మార్గానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మెట్రోకు ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద శంకుస్థాపన
- తమ ప్రభుత్వం వరుసగా అభివృద్ధి పనులతో ముందుకు సాగుతోందన్న ముఖ్యమంత్రి
- ఎన్నికల సమయంలోనే రాజకీయాలు... మిగతా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యత ఉంటుందని హామీ
మెట్రో రైలు మార్గానికి శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తమ ప్రభుత్వం వరుసగా అభివృద్ధి పనులతో ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామని, మిగతా సమయాల్లో అభివృద్ధికే తమ ప్రాధాన్యత ఉంటుందన్నారు. హైదరాబాద్‌కు తాగునీరు కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందన్నారు.