బంగాళాఖాతంలో అల్లకల్లోలం.. వేటకు వెళ్లిన ఏడుగురు ఉత్తరాంధ్ర మత్స్యకారుల గల్లంతు!
- విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు
- శనివారం మధ్యాహ్నానికి వస్తామని చెప్పిన వైనం
- అల్పపీడన ప్రభావంతో అల్లకల్లోలంగా సముద్రం
- పనిచేయని మొబైల్ ఫోన్లు
- రంగంలోకి మత్స్యశాఖ అధికారులు
సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వీరిని ఫోన్ ద్వారా సంప్రదించగా.. శనివారం మధ్యాహ్నానికల్లా తీరానికి చేరుకుంటామని చెప్పారు. అయితే, సాయంత్రం దాటినా బోటు హార్బర్‌కు చేరుకోకపోవడంతో తీరంలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం వీరి ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
వేటకు వెళ్లిన బోటులో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడుతో పాటు భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు ఉన్నారు. సమాచారం అందుకున్న మత్స్యశాఖ అధికారులు గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.