చైనా నుంచి పాకిస్థాన్ వెళ్తున్న నౌకను ముంబైలో ఆపివేసిన భారతీయ భద్రతా సంస్థలు
- అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి వినియోగించే సరుకు ఉందన్న అనుమానంతో తనిఖీలు
- ‘కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్’ యంత్రాన్ని గుర్తించిన అధికారులు
- పాకిస్థాన్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాల్లో పరికరాల తయారీకి ఉపయోగించొచ్చంటున్న నిపుణులు
కాగా సీఎంసీ యంత్రాలను కంప్యూటర్ల ద్వారా నియంత్రిస్తారు. అత్యధిక సామర్థ్యం, స్థిరత్వం, ఖచ్చితత్వం కోసం ఈ యంత్రాలను ఉపయోగిస్తుంటారు. నౌకలోని ఈ యంత్రాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) బృందం పరిశీలించింది. పొరుగుదేశం పాకిస్థాన్ ఈ యంత్రాన్ని తన అణు కార్యక్రమం కోసం ఉపయోగించే అవకాశం ఉందని డీఆర్‌డీవో బృందం నిర్ధారించింది. పాకిస్థాన్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాల్లో కీలకమైన భాగాల తయారీకి ఈ యంత్రాన్ని ఉపయోగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.