ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండున్నర రోజుల బ్యాకప్.. రెడ్‌మీ నోట్ 17 5జీ విడుదల
- ప్రారంభ ధర రూ.27,999
- 8,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ
- 120Hz అమోలెడ్ డిస్‌ప్లే
- 50 ఎంపీ ప్రధాన కెమెరా
- కొన్ని క్రెడిట్ కార్డులతో రూ.3,000 తగ్గింపు
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్
షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మీ భారత్‌లో నోట్ 17 5జీ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం విడుదల చేసింది. ఈ సిరీస్‌లో దేశీయ మార్కెట్‌కు వచ్చిన తొలి ఫోన్ ఇదే. 8,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.27,999గా నిర్ణయించింది.
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.30,999గా ఉంది. ఎస్‌బీఐ, యాక్సిస్, కొటక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఆగస్టు 12 నుంచి అమెజాన్, షావోమీ ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ట్రూకలర్ అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3పై పనిచేస్తుంది. నాలుగేళ్ల ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్లు, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ ప్రకటించింది.
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. గరిష్ఠంగా 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు మెమరీ విస్తరించుకోవచ్చు. ఐపీ65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు మెరుగైన కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందించింది.
ఫొటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, మరో సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు రెండున్నర రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే 22.5 వాట్ల రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.