'వ్యూహం', 'శపథం' సినిమాలను టీడీపీ, జనసేన వాళ్లు చూస్తారా? అనే ప్రశ్నకు రామ్ గోపాల్ వర్మ సమాధానం ఇదే!
- వాళ్లు బాత్రూమ్ లలో కూర్చొని చూస్తారన్న వర్మ
- ఈ సినిమాల్లో నిజాలను నగ్నంగా చూపించానని వెల్లడి
- ఇష్టం ఉంటే చూడండి.. లేకపోతే మానేయండి అని వ్యాఖ్య
టీడీపీ, జనసేన వాళ్లు ఈ చిత్రాలను చూస్తారా అని కొందరు అడుగుతున్నారని... తాను పోర్న్ చూసే విధంగా... ఈ సినిమాను వాళ్లు బాత్రూమ్ లలో చూస్తారని చెప్పారు. రాజకీయాలకు సంబంధం లేకుండా న్యూట్రల్ గా ఉండేవాళ్లు పబ్లిక్ గా అందరితో పాటు లివింగ్ రూమ్ లో చూడొచ్చని అన్నారు. 'వ్యూహం' ఈ నెల 23న, 'శపథం' మార్చి 1న విడుదల అవుతున్నాయని చెప్పారు. ఈ సినిమాలను ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే మానేయండి అని అన్నారు. ఈ వీడియోను చంద్రబాబు, లోకేశ్, జగన్ లకు ట్యాగ్ చేశారు.