500 - 501 వికెట్ల మధ్య చాలా జరిగాయి.. రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ భావోద్వేగం
- తల్లి ఆరోగ్యం బాగోలేక అశ్విన్ 48 గంటలపాటు తీరికలేని ప్రయాణం చేయడంపై స్పందించిన భార్య
- హైదరాబాద్, వైజాగ్ టెస్టులలో 500వ వికెట్ రికార్డు దక్కకపోవడంతో కొని ఉంచిన స్వీట్లు పంచామని వెల్లడి
- 500వ వికెట్ తీసినప్పుడు మౌనంగా ఉండిపోయామంటూ అశ్విన్ తల్లి ఆరోగ్యాన్ని ప్రస్తావించిన ప్రీతి నారాయణన్
‘‘500వ వికెట్ కోసం అశ్విన్ హైదరాబాద్ టెస్టులో ప్రయత్నించాడు. అది జరగలేదు. వైజాగ్ టెస్టులోనూ సాధ్యపడలేదు. కాబట్టి అప్పటికే కొని ఉంచిన స్వీట్లను 499వ వికెట్ వద్దే ఇంటి దగ్గర అందరికీ మేము పంచిపెట్టాము. 500వ వికెట్ దక్కింది కానీ మేము మౌనంగా ఉండిపోయాం. 500 - 501 వికెట్ల మధ్య చాలా జరిగాయి. మా జీవితంలో అత్యంత సుదీర్ఘంగా గడిచిన 48 గంటలు ఇవి. నేను చెప్పేదంతా 500వ వికెట్, అంతకుముందు ప్రదర్శన గురించే. నిజంగా ఎంత అసాధారణమైన వ్యక్తి. అశ్విన్.. మీ పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. మేము నిన్ను అభిమానిస్తున్నాము!’’ అంటూ ప్రీతి నారాయణన్ వ్యాఖ్యానించారు. అశ్విన్ ఫొటోను ఆమె ఈ సందర్భంగా షేర్ చేశారు.