సోనియా గాంధీ కుటుంబానికి భారతరత్న ఇచ్చుకున్న కాంగ్రెస్... పీవీకి ఇవ్వలేదు: కిషన్ రెడ్డి
- కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శ
- తెలంగాణ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయిందన్న కిషన్ రెడ్డి
- పీవీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినప్పటికీ తాము భారతరత్న ప్రకటించామన్న కేంద్రమంత్రి
రాహుల్ గాంధీ ఆదేశాలతో గుత్తేదారులను బెదిరించి సూట్ కేసులు ఢిల్లీకి మోసుకెళుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు తేడా లేదని... ఇవి నాణేనికి బొమ్మ-బొరుసు వంటివన్నారు. ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ అడుగుజాడల్లో నడుస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో కుంభకోణాలు జరిగాయన్నారు. కుంభకోణాల పార్టీలు ఇప్పుడు కుమ్మక్కయ్యాయని వ్యాఖ్యానించారు.