కథ నచ్చితేనే కరుణించే సాయిపల్లవి .. ఆమె కోసమే ఫ్యామిలీ ఆడియన్స్ వెయిటింగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కథ నచ్చితేనే కరుణించే సాయిపల్లవి .. ఆమె కోసమే ఫ్యామిలీ ఆడియన్స్ వెయిటింగ్!

Sai Pallavi Special
  • మూడు భాషల్లో సాయిపల్లవికి క్రేజ్ 
  • సెట్స్ పై ఉన్న 'తండేల్' ప్రాజెక్టు
  • నాగచైతన్య జోడీగా రెండోసారి
  • దర్శకుడిగా చందూ మొండేటి

సాయిపల్లవి .. తెలుగు ఆడియన్స్ లో ఈ పేరు పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకు కారణం మొదటి నుంచి ఆమె ఎంచుకుంటూ వచ్చిన కథలు .. పాత్రలు అనే చెప్పుకోవాలి. సాయిపల్లవి రాకముందు ఆడియన్స్ కేవలం హీరోల డాన్సులను గురించే మాట్లాడుకునేవారు. కానీ ఆమె వచ్చిన తరువాత ఆమె డాన్స్ ఆ సినిమాలకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవడం మొదలైంది. సాయిపల్లవి నటనకి ఆమె డాన్స్ ప్రధానమైన బలంగా మారింది. సాయిపల్లవికి తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ మూడు భాషల్లోను ఆమెకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అదే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అదే స్థాయిలో మద్దతు ఉంది. నెక్స్ట్ ఏ సీన్ తెరపై ఊడిపడుతుందో అనే డౌట్ లేకుండా సాయిపల్లవి సినిమాను హాయిగా .. తాపీగా చూడొచ్చనే ఒక నమ్మకం వాళ్లలో ఉంది. అలాంటి ఒక నమ్మకాన్ని ఆమె సంపాదించుకుంది. హీరో ఎవరైనా .. డైరెక్టర్ ఎవరైనా .. బ్యానర్ ఏదైనా సాయిపల్లవికి కథ నచ్చాలి .. తన పాత్రను తాను మెచ్చాలి. లేదంటే ఆమెను ఒప్పించడం కష్టమే. అలాంటి సాయిపల్లవితో ఈ సారి ఆడియన్స్ కి గ్యాప్ వచ్చింది. సరైన కథలు రాలేదనేది ఆమె చెప్పే మాట. ఆమె తాజా చిత్రంగా .. చైతూ జోడీగా 'తండేల్' రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగు దశలో ఈ సినిమా ఉంది. ఇటీవలే కర్ణాటక .. గోవాలలో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసమే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.

Advertisement
Sai Pallavi
Actress
Chaithu
Chandu Mondeti

More Telugu News