'గుంటూరు కారం' నుంచి నాటు సాంగ్ .. మరింత పెరిగిన ఘాటు!
- త్రివిక్రమ్ నుంచి 'గుంటూరు కారం'
- మహేశ్ జోడీకట్టిన శ్రీలీల
- సంగీతాన్ని అందించిన తమన్
- మాస్ పాటలో మరింత ఘాటు
- సంక్రాంతికి సినిమా రిలీజ్
'ఆ కుర్చీని మడతబెట్టి' అంటూ ఈ పాట మొదలవుతోంది. తమన్ స్వరకల్పనలో మహేశ్ బాబు - శ్రీలీల బృందం పై చిత్రీకరించిన పాట ఇది. ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ పాటను చిత్రీకరించారనే విషయం తెలుస్తోంది. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేసుకున్న పాట అనే సంగతి అర్థమవుతోంది. పూర్తి పాట ఈ సాయంత్రం 4:05 నిమిషాలకు వదలనున్నారు.