నంది అవార్డులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు

Komatireddy Venkat Reddy comments on Nandi Awards
  • కొత్త ఏడాదిలో నంది అవార్డులు ఇస్తామన్న కోమటిరెడ్డి
  • చిత్ర పరిశ్రమను సత్కరిస్తే తమ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని వ్యాఖ్య
  • ఉగాది నాటికి నంది అవార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్న కోమటిరెడ్డి
నంది అవార్డులపై రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... కొత్త ఏడాదిలో నంది అవార్డులను ఇస్తామని స్పష్టం చేశారు. చిత్రపరిశ్రమను సత్కరిస్తే తమ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని వ్యాఖ్యానించారు. రానున్న ఉగాది నాటికి నంది అవార్డులను ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఈ అవార్డులను ఇస్తామన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం సినిమా పెద్దలను ఆహ్వానిస్తామని తెలిపారు.
Go Back to Shorts
Komatireddy Venkat Reddy
Telangana
Tollywood
nandi awards

More Telugu News