ఏపీలో పరిశ్రమలు పెట్టాలని వస్తే కమీషన్లు అడుగుతున్నారు: టీడీపీ ఎంపీ కనకమేడల ఆరోపణ
- జగన్ వచ్చాక రాజకీయ కక్ష సాధింపులు పెరిగాయని ఆరోపణ
- పరిశ్రమలలో 50 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్న కనకమేడల
- పరిశ్రమలలో వాటాలు పొందడంపైనే శ్రద్ధ పెడుతున్నారని విమర్శలు
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఇలాంటి విధానాల వల్ల ఏపీలో నిరుద్యోగిత పెరిగిపోయిందని ఎంపీ కనకమేడల ఆరోపించారు. అమరరాజా కంపెనీ మహబూబ్ నగర్ కు తరలిపోవడానికి కారణమేంటనేది అందరికీ తెలుసని చెప్పారు. జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యలు చేపట్టడంతో అమరరాజా బ్యాటరీ కంపెనీ అధినేత జయదేవ్ గల్లా తన కొత్త కంపెనీని తెలంగాణలో పెట్టాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ కంపెనీ మన రాష్ట్రంలో పెడితే సుమారు లక్ష మందికి ఉద్యోగాలు లభించేవని ఎంపీ కనకమేడల చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదు.. ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలను పెట్టుబడులు పెట్టకుండా ఇలాంటి చర్యలతో అడ్డుకుంటోందని తీవ్రంగా మండిపడ్డారు. ఈ రకమైన విధ్వంసకర పాలన వల్లే రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని చెప్పారు.