ఆటో డ్రైవర్లు అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
- ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నార్న పొన్నం ప్రభాకర్
- ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ
- ఆటో వాళ్ళు తమ సోదరులేనని వ్యాఖ్య
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని.. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆటో వాళ్ళు మా సోదరులేనని, వాళ్ళకు కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో వారి విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండాలని సూచించారు.