'రాక్షస రాజా'గా వస్తున్న రానా
- డైరెక్టర్ తేజ, రానా కాంబినేషన్ లో కొత్త మూవీ
- వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి
- రానా బర్త్ డే సందర్భంగా ఫస్ట్ పోస్టర్ రిలీజ్
ఈ కొత్త ప్రాజెక్టులో రానాను రాక్షసుడిగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ కూడా ‘రాక్షస రాజా’ అని ఫిక్స్ చేసినట్లు హీరో, డైరెక్టర్లు అనౌన్స్ చేశారు. అనంతరం ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో నుదుట నామాలు, భుజాన గన్, నోట్లో చుట్టతో రానా చాలా వైల్డ్ గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ తో రాక్షస రాజుగా రానా పాత్ర ఎంత వైల్డ్ గా ఉండబోతోందో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఈ సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ రేంజ్ లో ప్రభావం చూపనుందా అంటే.. వేచి చూడాల్సిందేనని సినీ విశ్లషకులు అభిప్రాయపడుతున్నారు.