‘సలార్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘సలార్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

first song from salaar movie released
  • ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్
  • రెండు భాగాలుగా మూవీ, ఈ నెల 22న విడుదల కానున్న ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ 
  • మూవీలోని తొలి పాట ‘సూరీడే గొడుగు పట్టి..’ తాజాగా విడుదల 
  • అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సలార్’ త్వరలో విడుదల కానుంది. ఈ  మూవీలో శ్రుతిహసన్ హీరోయిన్‌ కాగా పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతి బాబు ముఖ్యపాత్రలు పోషించారు. సలార్‌ను దర్శకుడు రెండు భాగాలుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ ఈ నెల 22న విడుదల కానుంది. 

ఇదిలా ఉంటే, మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. సినిమా ట్రైలర్‌కు ఇప్పటికే అద్భుత స్పందన రాగా మేకర్స్ తాజాగా సలార్ మొదటి సాంగ్ రిలీజ్ చేశారు. సూరీడే గొడుగు పట్టి.. అంటూ స్నేహగీతాన్ని కృష్ణకాంత్ రచించారు. రవి బన్రూర్ సంగీతం అందించగా హరిణి పాడారు. ఈ పాటకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 
Advertisement
Salaar first song
Prabhas
Prashanth Neel

More Telugu News